- విద్యార్థులకు సమగ్ర విద్యాబోధన జరగాలి
- 8 వ తరగతి నుండే నీట్ ,ఎంసెట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయాలి
- 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు అభినందనలు ఫలితాలు తక్కువగా వచ్చిన ప్రిన్సిపాల్ లకు హెచ్చరిక
- మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలపై సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరు పై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్ ను అభినందించారు. ఫలితాలు తక్కువగా వచ్చిన గురుకుల విద్యాసంస్థలు కారణాలు సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం మంచి ఫలితాలు సాధించేలా పని చేయాలిని ఆయన అన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని ఆదిశగా అధ్యాపక బృందం పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువులతో పాటు ఆటలు , సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్, ఏఐ, తదితర అంశాలపై ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను అభిందించడంతో పాటు ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిన పాఠశాలల ప్రిన్సిపాల్ లను మందిలించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు.గతంలో 327 స్కూల్ లలో 301 స్కూల్ లో ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయని, ప్రభుత్వం విద్యకు ప్రధాన్యత ఇవ్వడం తో గురుకులాలు అద్భుతంగా పని చేస్తున్నాయనీ తెలిపారు. గురుకుల పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వం మెస్ ఛార్జీలు కాస్మొటిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వం మీద విశ్వాసంతో ,అధ్యాపకుల విశ్వాసంతో తమ పిల్లలను గురుకులాలకు పంపిస్తున్నారనీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఉపాధ్యాయులతోనే పిల్లలు సమయం ఇస్తారని తమ సొంత పిల్లల మాదిరి విద్యార్థులను చూసుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మంచైనా,చెడైనా అధ్యాపకులు దిక్సూచి అని తెలిపారు.
2026-27 సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని బీసీ సంక్షేమ శాఖ గురుకులాలు మరింత సమర్థవంతంగా విజయాలు సాధించాలనీ ఆకాంక్షించారు. ఎవరిని ఇబ్బంది పెట్టి పని చేయించుకోవడం లేదనీ పూర్తి స్థాయిలో విద్యా బోధన జరగాలనీ ఆదేశించారు.ప్రైవేట్ భవనాల్లో నెల వారి అద్దె కడుతున్నప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోతే కల్పించుకునే బాధ్యత ప్రిన్సిపల్ లది సూచించారు.టాయిలెట్స్, ఫ్యాన్స్,ఇతర మౌలిక సదుపాయాలు ఏం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనీ తెలిపారు.ఎంజేపీ గురుకులాలు అద్భుతంగా ఉండాలంటే అందరూ కలిసి సమిష్టి గా ఒక కుటుంబం లాగ పని చేయాలన్నారు.పిల్లల ఉజ్వల భవిష్యత్తు జ్ఞాపకులపై ఆధారపడి ఉందన్నారు. సమాజంలో ఏ విధంగా బతకాలి , డిసిప్లెన్, తల్లిదండ్రుల తో ఎలా వ్యవహరించాలి..పెద్దలతో ఎలా మాట్లాడాలి అని విద్యార్థులకు నేర్పించాలని సూచించారు.చిన్న చిన్న కారణాలతో గురుకులాల్లో సూసైడ్ జరుగుతున్నాయని విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని కల్పించాలని వారిలో మోటివేటివ్ కల్పించాలన్నారు.జిల్లాలో ఉన్న స్కూల్స్ వారిగా సమీక్ష లు చేస్తూ వంద శాతం ఫలితాలు వచ్చిన స్కూల్స్ అభినందిస్తూ.. తక్కువ ఫలితాలు వచ్చిన స్కూల్స్ ఆత్మపరిశీలిన చేసుకోవాలనీ సూచించారు.
అధ్యాపకులంతాఎంజేపీ కి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనీ పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల వారు కూడా మన విద్యా విధానం వచ్చి ఇక్కడ అధ్యయనం చేసేలా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. పదవ తరగతి 98.45 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సెక్రెటరీ సైదులు తో పాటు ప్రిన్సిపల్ లను అభినందించారు.500 పైన వచ్చిన మార్కులు 9788 మంది విద్యార్థులకు వచ్చాయనీ204 ఎంజేపీ గురుకులాలు 100 శాతం ఫలితాలు సాధించాయనీ సంతోషం వ్యక్తం చేశారు.65 స్కూల్స్ వెనుకబడి ఉన్నాయనీ ఆ స్కూల్స్ ఆత్మపరిశీలిన చేసుకోవాలి ఉత్తీర్ణత తక్కువగా వస్తె మంచిది కాదనీ హెచ్చరించారు.ఫెయిల్ అయిన విద్యార్థులు తెలుగు లో సబ్జెక్ట్ లో ఎక్కువగా కనిపిస్తున్నారనీ తెలుగు లో ఫెయిల్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.ప్రతి స్కూల్ లో ర్యాంకర్ల ఫోటో లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలనీగ్రామాల్లో గురుకులాల్లో వచ్చిన మార్కులు ఫలితాలు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 90.31 శాతం ,ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 97.72 శాతం , ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం లో 85.80 శాతం, ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 95.81 శాతం పాస్ శాతం ఉందని 900 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 4183 మంది విద్యార్థులు ,980 మార్కులు పైన 496 మంది విద్యార్థులు సాధించారనీ ఇంటర్మీడియట్ లో తక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చిన గురుకులాలను హెచ్చరించారు.35 విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయనీ అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 8 విద్యా సంస్థలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు.ఎంజేపీ లో చదివిన పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు నేరుగా ఇంటర్మీడియట్ తరగతులకు అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.గురుకుల పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు ఇంకా ఏమి అవసరమని ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఇంటర్మీడియట్ లో వచ్చిన ఫలితాలు మాదిరి tgeapcet లో ర్యాంకులు రావాలన్నారు.ప్రతి గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు.8 వ తరగతి నుండే నీట్ ,ఎంసెట్ ,కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించాలన్నారు.జిల్లాలో గురుకుల పాఠశాలలు విజిట్ చేస్తాంమని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తప్పనిసరి చేసి ఎంజేపీ కి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సెక్రటరీ సైదులు, ఆర్సీవో లు ,ప్రిన్సిపల్ లు హాజరయ్యారు.
