తమిళనాడు మంత్రి పి. విశ్వనాథన్‌కు మంత్రి పొంగులేటి సన్మానం

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి మంత్రి పొంగులేటిని సత్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తమిళనాడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న పి. విశ్వనాథన్‌ను శాలువా, పూల మొక్కతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రజాసేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశ్వనాథన్ కృషి చేయాలని ఆకాంక్షించారు.