జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అటవీ రేంజ్ అధికారి గులాం మొయినుద్దీన్ గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొడిమ్యాల మండలానికి చెందిన ఓవ్యక్తికి 120 టేకు చెట్లను అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చేందుకు రేంజ్ అధికారి రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి అధికారికి మే 13న లక్ష రూపాయలు ఇవ్వగా మిగతా లక్ష ఇస్తేనే అనుమ తిస్తానని రేంజ్ అధికారి తెలపడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించాడు. వారి సూచన మేరకు అధికారికి నగదు ఇస్తుండగా పట్టుకున్నారు.