- నోట్ల కట్టలు.. 3 కిలోల బంగారం..!
- వ్యవసాయ భూముల పత్రాలు కూడా..
- ఏసీబీ తనిఖీలో షాకింగ్ విషయాలు
ఆదాయానికి మంచిన ఆస్తుల ఆరోపణలపై R&B ENC మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రెయిడ్స్ లో మోహన్ నాయక్ అక్రమార్జన చిట్టా బట్టబయలవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని రూ.60 లక్షల నగదు పాటు కిలో బంగారు నగలు, 15 బంగారం బిస్కెట్లు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్ లో వ్యవసాయ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే మోహన్ నాయక్ ఇంట్లో గుర్తించిన బంగారం మొత్తం 3 కిలోల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు ముగిసే సమయానికి మోహన్ నాయక్ అక్రమాల జాబితా ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఉత్కంఠగా మారింది.
4 అధికారాన్ని అడ్డం పెట్టుకుని..
మోహన్ నాయక్ తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఆర్ అండ్ బీ శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమీషన్ల రూపంలో భారీగా వెనకేసినట్లు చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మోహన్‌నాయక్ ఆర్థిక లావాదేవీలపై చాలా రోజులుగా రహస్యంగా నిఘా పెట్టామని, పక్కా సమాచారంతో ఇవాళ సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.