యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఎంసీఆర్.హెచ్.ఆర్.డి. బోధి పెవిలియన్ లో యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంఎల్ ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్
ఎం. హనుమంతరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ సెక్రటరీ మానిక్ రాజ్, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాదగిరి గుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలి. వివిధ మఠాలకు భూముల కేటాయింపు పైన ఒక విధానం రూపొందించాలన్నారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపు పైన స్పష్టమైన నిబంధనల తో కూడిన విధానం తయారుచేయాలి. భూమి యాజమాన్యపు హక్కులు టెంపుల్ వద్దనే ఉండాలి. భూముల కేటాయింపు పైన తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలి. గుట్ట పైన గెస్ట్ హౌస్ ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించాలన్నారు. విడతల వారీగా గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి అని సీఎం తెలిపారు. గెస్ట్ హౌస్ ల నిర్మాణం పైన తిరుమల మోడల్ ను అనుసరించాలి. భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలి. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం పైన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక పైన అధ్యయనంచేసి వారం లో నివేదిక ఇవ్వాలి. పబ్లిక్ ప్రైవేట్ విధానం లో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు..