ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి వాసం వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణ

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఎఎస్ మంగళవారం కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం, చార్మినార్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఇఆర్ఒ శ్రీమతి సరితారెడ్డితో కలిసి పర్యవేక్షించారు. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకున్న అపోహలపై వారికి నివృత్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశాలను , ఆవశ్యకతలపై ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా అడిషనల్ సిఇఒ మాట్లాడుతూ ‘సర్’ ప్రక్రియ కేవలం ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ఓటర్లందరికి ఓటుహక్కు కల్పించడం, అనర్హులైన ఓటర్లను తొలగించడం అని అన్నారు. సర్ ప్రక్రియపై ప్రజలు ఆందోళన చేందాల్సిన అవసరం లేదని, ఇది పూర్తి పారదర్శకతతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడంలో బిఎల్ఒలు, సూపర్ వైజర్లు సహకరించాలని ఆదేశించారు. పూర్తి చేసిన ఫారాలను తప్పనిసరిగా బిఎల్ఒలకు అందజేసిన వారి పేర్లే ఓటర్ జబితాలో చేర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు.