హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న SIR కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి, ఐఏఎస్ శుక్రవారం నాడు ఖైరతాబాద్, రాజెంద్రనగర్ నియోజకవర్గలలో పర్యటించి SIR ప్రక్రియా పరిశీలించారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెం.211, బంజారాహిల్స్ , పరిధిలోని ఫిల్మ్ నగర్, MRC కాలనీలో ఉన్న పోలింగ్ స్టేషన్ నం. 184ను సందర్శించారు. అదేవిదంగా రాజేంద్రనగర్ నియోజకవర్గలోని కోకాపేట, మంచీరేవుల ప్రాంతాలలో గల పోలింగ్ క్రేందాలను సందర్శించి, ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ పురోగతిని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి చేసే ఓటర్ల గణన పురోగతి తెలుసుకున్నారు. అలాగే, శాశ్వతంగా తరలివెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల ధృవీకరణ, పరిష్కారం కోసం సరైన ప్రక్రియను అనుసరించాలని BLO లను ఆదేశించారు. BLO లు ఖచ్చితంగా ఇంటింటికీ వెళ్లి (Enumeration) గణన పత్రాలను స్వయంగా ఓటర్లకు అందచేయాలని ఆయన ఆదేశించారు. అలాగే, BLO యాప్ ద్వారా శాశ్వతంగా నివాసం మారినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలన, తొలగింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల ఆన్ లైన్ https://voters.eci.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని ఈ విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో ఖైరతాబాద్ ERO, BLO లు తదితరులు పాల్గొన్నారు.