సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇటీవల నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యులు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం పరిపాలనలో పారదర్శకత తదితర అంశాలపై ముఖ్యమంత్రి పాలక మండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో యాదాద్రి క్షేత్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పాలక మండలి కృషి చేస్తుందన్నారు.