- ఈ నెల చివరిలో ఉద్యోగ విరమణ
ఓ రైతు వద్ద గ్రామ పటం మార్చడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ సర్వే లాండ్ రికార్డ్సు శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బీ వెంకటేశ్వర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం భూత్పుర్ మండలంలోని కర్వేన గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోవడంతో వాటిని సరి చేసుకునేందుకు అవసరమైన గ్రామ పటం సరిచేసి ఇవ్వాలని సర్వే అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి లంచం అడగడంతో రూ.10 వేలు ఇచ్చాడు. మరో రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి ప్లాన్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్‌లో రైతు సర్వే ల్యాండ్ రికార్డ్సు అధికారి వెంకటేశ్వర్‌రెడ్డికి రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వెంకటేశ్వర్‌రెడ్డిని గురువారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో ని ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదా లు నిర్వహించారు. వెంకటేశ్వర్‌రెడ్డి 2020లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ బాధితుడి నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంతా జరిగినా ఈ నెల జూలైలో ఉద్యోగ విరమణ సమయం ఉన్నా కూడా పట్టించుకోకుండా లంచానికి అలవాటు పడి మరోసారి లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.