తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం మరియ ఈక్విప్ (EQUIPPP) సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మద్య Constituency Development Exchange -CDX పై అవగాహన ఒప్పందం.. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ MOU కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, కౌన్సిల్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, ఈక్విప్ డైరెక్టర్ శ్రీమతి వింద్యా ధర్మరాజు, ఈక్విప్ ఫౌండర్ లక్ష్మీ నారాయణ, ఐ ల్యాబ్స్ చైర్మన్ శ్రీని రాజు తదితరులు.
ఈ సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రజల సంక్షేమం కోసం సరికొత్తగా ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థతో MOU
జరగడం శుభపరిణామం. ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి . చట్టాలు తయారు చేసే ఎమ్మెల్యేలు , నేడు నియోజకవర్గ స్థాయిలో అన్ని పనులు చేసే భాద్యుడు గా మారారు.
ఏ చిన్న సమస్య ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నియోజలవర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రైవేట్ సంస్థలు కూడా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఈక్విప్ సంస్థ తీసుకువచ్చిన constancy development exchange ( CDX ) అనే కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం. నేడు జరిగిన MOU చారిత్రాత్మక ఘట్టం అవుతుందని గర్విస్తున్నాం.
ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటుగా ప్రవేటు రంగం, పౌర సమాజం, విద్యా సంస్థలు, దాతలను, NGO లను మరియు CSR నిధులను సమీకరించి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకమైన ఫలితాలను సాదించవచ్చు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం మరియ ఈక్విప్ సంస్థల మద్య ఈ రోజు కుదుర్చుకుంటున్న MOU అనేది భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు, సహకారం, పౌర భాగస్వామ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. తెలంగాణ శాసనసభ సచివాలయం- ఈక్విప్ సంస్థ మద్య ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యుల సహకారం, సలహాలతో నైపుణ్యాభివృద్ధి విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, డిజిటల్ సమ్మిళితం, సుస్థిర జీవనోపాది మరియు ఆర్ధిక పరిపుష్టి వంటి రంగాలలో ఈక్విప్ సంస్థ క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న అమలు చేస్తున్న ఇలాంటి సందర్భంలో, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం మార్గదర్శకంలో- ఈక్విప్ సంస్థ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లోని శాసనసభ నియోజకవర్గాలలో చేపట్టబోయే పనులన్ని కూడా పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడే విదంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతాయని భావిస్తూ, ఈ ప్రయత్నానికి నా వంతుగా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా నియోజకవర్గాల వారిగా అభివృద్ధికి ఒక వేదికగా ఈక్విప్ సంస్థ నూతన ఆలోచనతో ముందుకు రావడం సంతోషం. ఇలాంటి నూతన ఆలోచనలతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించడంతో పాటుగా, స్థానికంగా ఉన్న అవకాశాలను, రిసోర్స్ లను పారిశ్రామిక స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటుగా ఆర్ధిక స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు. నియోజకవర్గాల వారిగా రూట్ మ్యాప్ రూపొందించుకుని పనిచేయడం ద్వారా రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం తరుపున అన్ని విదాలుగా సహకారం అందిస్తాం.