ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో దడ

  • రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్‌ శాఖ EE, AEE

తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇవాళ మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఆదిలాబాద్‌లో నీటిపారుదల ( Irrigation ) శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) రాథోడ్ విట్టల్, అసిస్టెంట్ ఇంజనీర్(AE) ప్రకాష్ లను ఏసీబీ (ACB ) ఆదిలాబాద్ రేంజ్ ట్రాప్ బృందం గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. సుమారు రూ.60 వేలు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఉన్న ఈఈ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది.