ఈ-సిటీ మహేశ్వరం పారిశ్రామిక పార్కులలో పలు పరిశ్రమలను సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్: ఈ-సిటీ (eCity)లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (Electronic Manufacturing Cluster – EMC) ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్క్ ను సందర్శించి, ఎం/ఎస్. చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నేడు ఉదయం సందర్శించారు. సి.ఎస్ తో పాటు టి.జి.ఐ.ఐ.సి. (TGIIC) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంకతో పాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముందుగా, మెసర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఈ-సిటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ సంస్థ సోలార్ పీవీ (PV) మాడ్యూల్స్ తయారీచేస్తోంది. రూ.1,240 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ప్రస్తుతం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అనంతరం ఎం/ఎస్. అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమను సీ.ఎస్ సందర్శించారు. ఈ సంస్థ 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ-సిటీలో ఉన్న ఈ పరిశ్రమ హైటెక్ రక్షణ ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ పేలోడ్ వ్యవస్థలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా చేపడుతోంది. రూ.59.22 కోట్ల పెట్టుబడితో ఉన్న ఈ సంస్థలో 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఈ సందర్బంగా, మంఖాల్ పారిశ్రామిక పార్క్ ను సందర్శించి, మెసర్స్ చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్రమను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. . ఈ సంస్థకు ప్రారంభంలో 1,20,881 చదరపు మీటర్లు (29.87 ఎకరాలు) విస్తీర్ణం గల భూమి బీఓపీపీ (BOPP)/బీఓపీఈటీ (BOPET) ఫిల్మ్ తయారీ యూనిట్ స్థాపన కోసం కేటాయించారు. . ఇందులో కోటింగ్, మెటలైజింగ్, స్లిట్టింగ్ మరియు రీసైక్లింగ్ ఉత్పత్తులు జరుగుతాయి. కాగా, తమకు . కేటాయించిన స్థలంలో ఈ చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ సంస్థ తన తయారీ యూనిట్‌ను విజయవంతంగా నెలకొల్పి, ప్రాజెక్టుతో పాటు విస్తరణ ప్రాజెక్టును కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ యూనిట్ వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ రూ.284.02 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తోంది. అనంతరం, మహేశ్వరం జనరల్ పార్క్ లోని మెసర్స్ విప్రో ఎంటర్‌ప్రైజెస్ (ప్రైవేట్) లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఈ సంస్థకు 1,21,410 చదరపు మీటర్లు (30 ఎకరాలు) విస్తీర్ణంలో భూమి కేటాయించారు. ప్రస్తుతం ఈ యూనిట్ రూ.17,434 లక్షల పెట్టుబడితో వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ 331 మందికి ఉపాధి కల్పిస్తోంది. చివరిగా ఎం/ఎస్. మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను సంజయ్ జాజు సందర్శించారు. ఈ సంస్థకు మహేశ్వరం జనరల్ పార్క్‌లోని మొత్తం 14,973 చదరపు మీటర్లు (3.7 ఎకరాలు) విస్తీర్ణంలో భూమి అత్యాధునిక రత్నాలు, ఆభరణాల తయారీ యూనిట్ స్థాపన కోసం కేటాయించారు. ఈ సంస్థకు కేటాయించిన స్థలంలో తయారీ యూనిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసి విస్తరణ ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ యూనిట్ రూ.37,405 లక్షల పెట్టుబడితో వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ 2,782 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలనిసీ.ఎస్ సంజయ్ జాజు అధికారులను కోరారు.