- ప్రతి పౌరుడికి నాణ్యమైన కంటి వైద్య సేవలు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవల బలోపేతానికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యం
- రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య సేవల రిఫరల్ వ్యవస్థను మరింత బలోపేతం
ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ. రాష్ట్రం లోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నేత్ర వైద్య విభాగాలు ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కంటి పరీక్షలు, ఆప్టోమెట్రీ సేవలు, శుక్లాల (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి రాష్ట్రంలో నేత్ర వైద్యానికి అత్యున్నత కేంద్రంగా సేవలందిస్తోందన్నారు. రెటీనా శస్త్రచికిత్సలు, లేజర్ చికిత్సలు, మెల్లకన్ను (స్క్వింట్) శస్త్రచికిత్సలు, కార్నియా మార్పిడి, కంటి క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు, గ్లాకోమా చికిత్సలు వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య సేవల రిఫరల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా స్థాయి ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో ప్రత్యేక నేత్ర శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్లు, అవసరమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడానికి ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే అవసరమైన ప్రణాళికలను (గ్యాప్ అసెస్మెంట్) రూపొందించామన్నారు. ఈ పనులను దశలవారీగా అమలు చేయడానికి వైద్య శాఖ సమాయత్తమైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవల బలోపేతానికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యం తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో అమలు చేస్తున్న నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని దశలవారీగా ఇతర జిల్లాలకు విస్తరించడం పై చర్చించారు. ఈ సందర్భంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న సేవలను అభినందించారు.
కార్నియా దానాలను ప్రోత్సహించేందుకు ప్రాంతీయ కార్నియా సేకరణ కేంద్రాలు (ఐ బ్యాంకులు) ఏర్పాటు చేసే అంశాన్ని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పరిశీలించడం.ఆర్బీఎస్కే (RBSK) సిబ్బందికి శిక్షణ అందించడం ద్వారా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన కంటి పరీక్షలు, ఆప్టోమెట్రీ సేవలు అందించడం. ప్రభుత్వ బోధన ఆసుపత్రులు మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మధ్య భాగస్వామ్య అవకాశాలను గుర్తించేందుకు ఆగస్టు నెలలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా క్రిస్టినా జెడ్ చొంగ్తు, DME డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డా రవీందర్ నాయక్, LV ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.