ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో, హెల్త్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఏసీబీ అదుపులోకి తీసుకున్న శ్రీనివాసులుకు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఈ నెల 16 వరకూ రిమాండ్ విధించారు. శ్రీనివాసులు రిమాండ్ కాలం 48 గంటలు దాటడంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఆయనపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఈ నెల 8 నుంచే ఆయనపై డీమ్డ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.