ఏపీలో కొత్తగా 7,228 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజుల నుంచి కరోనా తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,228 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 45 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,46,530కు చేరింది. ప్రస్తుతం  70,357 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 5,70,667 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,506కు చేరింది.  24 గంటల్లో 8,291 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 53,02,367 శాంపిల్స్‌ పరీక్షించారు.