ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను, డైరీని ఆయన ఆవిష్కరించారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.