టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారు. దీంతో ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా తనతో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.