టీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా అమరవాది లక్ష్మినారాయణ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా అమరవాది లక్ష్మినారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌ పరిశ్రమల భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు దామోదర్‌ గుప్తా, బొల్లం సంపత్‌ కుమార్‌ గుప్తా , టీఎస్‌ఐడీసీ ఎండీ ఈవీ నర్సింహరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తనపై సీఎం కేసీఆర్‌ ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని చెప్పారు.