గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన ప్రగ్యాజైస్వాల్‌

గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో  ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్‌ పాల్గొన్నది.  హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ప్రగ్యాజైస్వాల్‌ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిస్తూ బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పేర్కొన్నది. ఆక్సిజన్‌ను ఉచితంగా అందించే మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉన్నదని పిలుపునిచ్చింది. రెజీనా, అనుష్క, బోయపాటి శ్రీనులను గ్రీన్‌ఇండియాచాలెంజ్‌కు ప్రగ్యాజైస్వాల్‌ నామినేట్‌ చేసింది.