కొండపోచమ్మ ఆలయ చైర్మన్‌గా రాచమల్ల ఉపేందర్ ‌రెడ్డి

సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌నర్సాపూర్‌లో గల ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయం నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా రాచమల్ల ఉపేందర్ రెడ్డితో పాటు పదకొండు మందిని డైరెక్టర్ లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రెండోసారి చైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.