ఎస్‌వీజీ గ్రానైట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం .. నలుగురికి తీవ్రగాయాలు

ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఎస్‌వీజీ గ్రానైట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. గ్యాస్‌ లీకైన విషయాన్ని గుర్తించకుండా ఓ కార్మికుడు వెల్డింగ్‌ పనులు చేసేందుకు అగ్నిపుల్ల వెలగించడంతో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి అగ్గిపుల్ల వెలిగించిన వ్యక్తితోపాటు సమీపంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు.