తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా పాటిజివ్‌ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1897 కరోనా పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో  2982 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 5,67,285 మంది డిశ్చార్జ్  అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మరణించగా, ఇప్పటివరకు 3409 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,61,27,372 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 182 కరోనా పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి.