హరితహారంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి ఐకేరెడ్డి

హరితహారంతో దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పెద్ద అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15వేలకుపైగా నర్సరీలు ఉన్నాయని, ఇంత మొత్తంలో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేవన్నారు. భావి తరాల వారి కోసం ఆస్తులు, అంతస్తులు కాదు.. చెట్లు నాటి సంరక్షించాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.0People Reached0EngagementsBoost UnavailableLikeCommentShare