తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం రామాలయంలో వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవి, కుమారులు ప్రతీక్, ప్రణయ్లతో కలిసి పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా భద్రాచలంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.LikeCommentShare