అధికారికంగా చాక‌లి ఐల‌మ్మ జ‌యంతి, వ‌ర్ధంతి

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ ( Chakali Ilamma ) జయంతి , వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. చాక‌లి ఐల‌మ్మ సెప్టెంబరు 26, 1895న‌ జ‌న్మించారు. సెప్టెంబర్ 10, 1985న మ‌ర‌ణించారు.