ప్రభుత్వ కళాశాల లో నాణ్యమైన ఉన్నత విద్య లభిస్తుంది: ఆఫీసర్ వి.రమణ రావు

  • మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో స్పెషల్ – ఆఫీసర్ వి. రమణ రావు

తెలంగాణ ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డు వారి ఆదేశాల మేరకు స్థానిక సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడమైనది. ఇంటర్మీడియట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ వి. రమణారావు విద్యార్థుల తల్లిదండ్రులను ఉదేశించి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన ప్రమాణాలతో ఉచిత విద్య లభిస్తుందని, ప్రభుత్వం కూడా కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు, విద్యార్థుల అభివృద్ధిలో అటు అధ్యాపకుల పాత్ర ఎంత ముఖ్యమో ఇటు తల్లిదండ్రుల పాత్ర అంతే ముఖ్యమని అందుకే సమావేశం నిర్వహించడం జరిగింది. కళాశాలలో ఏర్పాటుచేసిన ‘వాల్ ఆఫ్ ఫేమ్’ లోనీ మీ కళాశాల పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని డి.కల్పన మాట్లాడుతూ విద్యార్థుల హాజరు మెరుగు పరచాలని క్రమం తప్పకుండ కళాశాలకు పంపాలని సూచించారు, రాబోయే పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూసే భాద్యత మనపై ఉందని, వారి భవిష్యత్ మన చేతులలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ హాస్టల్ వార్డెన్ అంజయ్య, తల్లిదండ్రులు పద్మ, రాంచందర్, శ్రీనివాస్, యశోద, శ్యామల, భాగ్యలక్ష్మి, హరికృష్ణ తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం పాల్గొన్నారు.