వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ సూచించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 188 వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీఆర్‌ఎఫ్, ఎమర్జెన్సీ బృందాలు, హైడ్రా ఎస్‌ఏఎఫ్ సిబ్బందితో పాటు ట్రాఫిక్, జలమండలి, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు. 9 చెరువులకు ఫ్లడ్ గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయంతో వర్షాకాల సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
