సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, సంగారెడ్డికి చెందిన 8 మంది మాన్సాన్ పల్లిలో ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్తుండగా..అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఆటోను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. శ్రవణ్ (40 ) సాయి విజ్ఞేష్ (11) సాయి చరణ్ (7) తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ (39) చనిపోయాడు. చికిత్స పొందుతున్న బాధితులను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పరామర్శించారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.