తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్.రాధాబాయి, ఉజ్మా ఆషాయి షకీరాలను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవుల్లో ఉంటారు.