గిరిజన సంక్షేమంలో AI విప్లవం.. తెలంగాణ నుంచి దేశానికి నూతన మార్గదర్శకం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • AI ట్రెబల్ ఇన్నోవేషన్ మిషన్’తో డిజిటల్ సాధికారతకు శ్రీకారం
  • డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక సమీక్ష సమావేశం

హైదరాబాద్ : గిరిజన సంక్షేమాన్ని సంప్రదాయ సంక్షేమ కార్యక్రమాల పరిమితి నుంచి డిజిటల్ సాధికారత దిశగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. “అడవుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా గిరిజన సమాజాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లడం ప్రజా ప్రభుత్వ బాధ్యత” అని స్పష్టం చేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గురువారం నిర్వహించిన “Al Intervention Development in Tribal Welfare Department” ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. “Inclusive Growth through Innovation” ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు గిరిజన సంక్షేమంలో భాగం చేస్తూ కొత్త తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నామని తెలిపారు.

విద్యలో AIతో స్మార్ట్ లెర్నింగ్
గిరిజన విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు Al ఆధారిత విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్చువల్ టీచర్లు, డిజిటల్ ట్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు AI ఆధారిత మాక్ టెస్టులు, కెరీర్ గైడెన్స్ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థికి డిజిటల్ స్కిల్స్తో పాటు AI నైపుణ్యాలు నేర్పించడమే లక్ష్యమన్నారు. విద్యార్థుల బలహీనతలను Al ద్వారా గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు, గిరిజన భాషల్లో ఈ-లెర్నింగ్ కంటెంట్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తండాలకు AI ఆరోగ్య సేవలు
దూర ప్రాంత గిరిజన గ్రామాలకు AI ఆధారిత టెలీమెడిసిన్ సేవలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని Al ద్వారా నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే AI డయాగ్నస్టిక్ వ్యవస్థలు, మొబైల్ హెల్త్ యూనిట్లలో AI హెల్త్ స్క్రీనింగ్ అమలు చేయనున్నట్లు చెప్పారు. పోషకాహార లోపాన్ని A1 ద్వారా గుర్తించి తక్షణమే పోషణ సేవలు అందించడంతో పాటు, గ్రామాల వారీగా ఆరోగ్య మ్యాపింగ్ చేపడతామని వెల్లడించారు. స్థానిక భాషల్లో Al చాట్బాట్ల ద్వారా ఆరోగ్య అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఉపాధి, జీవనోపాధికి డిజిటల్ బలం: గిరిజన యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. గిరిజన రైతులకు AI ఆధారిత వ్యవసాయ సలహాలు, వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు అందించనున్నట్లు తెలిపారు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కు సరైన మార్కెట్ ధరలను AI ద్వారా తెలియజేస్తామని చెప్పారు. గిరిజన మహిళా సంఘాలకు డిజిటల్ మార్కెటింగ్ సాయం, వెదురు, హస్తకళలు, అటవీ ఉత్పత్తులను ఈ-కామర్స్తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. AI ఆధారిత స్కిల్ మ్యాపింగ్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలును Tribal Startup Ecosystem ద్వారా తీసుకుంటామని తెలిపారు.

IT శాఖతో కలిసి ‘AI ట్రైబల్ ఇన్నోవేషన్ మిషన్ గిరిజన సంక్షేమ శాఖ, IT శాఖ సంయుక్తంగా “Al Tribal Innovation Mission” ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గిరిజన గురుకులంలో Al & Coding Labs ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ను AI హబా వినియోగించి Tribal Tech Ecosystem నిర్మాణం చేపడతామని వెల్లడించారు..

IT సంస్థల CSR భాగస్వామ్యంతో Tribal Digital Training Centres ఏర్పాటుచేసి యువతకు Data Analytics, Al, Cyber Security, Coding వరంగల్ శిక్షణ అందించిన అంటూ తెలిపారు ట్రైబల్ యూత్ కోసం ప్రత్యేక ఏఐ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ప్రవేశపెడతామని మంత్రి పేర్కొన్నారు.

సంక్షేమం నుంచి డిజిటల్ సాధికారత వైపు
గిరిజన తండాలకు మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తూ, డిజిటల్ తెలంగాణలో గిరిజన సమాజాన్ని భాగస్వామ్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. AI అనేది కేవలం టెక్నాలజీ కాదు.. సామాజిక న్యాయం సాధించే కొత్త సాధనం” అని మంత్రి పేర్కొన్నారు. “ప్రతి తండాలో విద్య, ఆరోగ్యం, ఉపాధి.. ప్రతి కుటుంబంలో గౌరవ జీవితం అందించడమే ప్రభుత్వ ధ్యేయం” అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి బిఎం. సంతోష్ , పి ఓ భద్రాచలం రాహుల్, ఉట్నూరు ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరందు, ఏటూరు నాగారం పిఓ లెనిన్ వట్సాల్. టోప్పో, ప్లేన్ ఏరియా ప్రాజెక్ట్ ఆఫీసర్ వి సర్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ TCR&TI డా. వి. సముజ్వల , SE హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.