- బ్రోషర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, మే 15: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోషర్‌ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 18న హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో మంత్రి జూపల్లి ఈ పర్యాటక వారోత్సవాలను మధ్యాహ్నం ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతి, ఎకో-టూరిజం ప్రదేశాలను ప్రమోట్ చేయడంతో పాటు, పర్యాటక రంగం ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భాషా సాంస్కృతిక శాఖ, పురావస్తు (హెరిటేజ్) శాఖ, నిథమ్ (NITHM) సంస్థల సమన్వయంతో పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా హెరిటేజ్ వాక్‌లు, పర్యాటక అవగాహన సదస్సులు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సమావేశాలు, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగానికి తిరుగులేని ఆదరణ ఉందన్న మంత్రి.. ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయం, నాగార్జునసాగర్, బుద్ధవనం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, పైగా సమాధులు, రేమండ్స్ టూంబ్స్, గన్‌ఫౌండ్రీ, ఖజానా బిల్డింగ్, పానగల్ మ్యూజియంతో పాటు వరంగల్‌లోని చారిత్రక కట్టడాలు స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని కొనియాడారు. మౌలిక వసతుల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక పర్యాటక ప్రచారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని సమీకృతంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా జానపద కళా ప్రదర్శనలు, పేరిణి, శాస్త్రీయ నృత్యాలు, సాహిత్య కార్యక్రమాలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
మే 23న హైదరాబాద్‌లో “డెస్టినేషన్ తెలంగాణ: స్ట్రాటజీస్ ఫర్ ది నెక్ట్స్ ఫ్రంటియర్ ఆఫ్ టూరిజం” (Destination Telangana: Strategies for the Next Frontier of Tourism) అనే ఇతివృత్తంతో ‘పర్యాటక సదస్సు (టూరిజం కాన్క్లేవ్) – 2026’ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సదస్సులో పర్యాటక రంగ భాగస్వాములు, హాస్పిటాలిటీ నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొని తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారని వివరించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ స్ఫూర్తితో నిర్వహించే ఈ వారోత్సవాలు తెలంగాణ పర్యాటక రంగానికి సరికొత్త కళను తీసుకువస్తాయని మంత్రి జూపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
షెడ్యూల్: 99-Day Action Plan Programme
Scheduled Week: May 18 to 23
TOURISM
May 18 – Monday
Rollout of Yuva Tourism Club activity plans across the State Selection process for best Yuva Tourism Clubs to be honoured on World Tourism Day 2026
Poster release by District Collectors
May 19 – Tuesday
Tourism awareness drives at tourist destinations
Awareness programme at Raymond’s Tombs, Hyderabad
May 20 – Wednesday
Heritage Walks in all districts
Tourism activation drive at Khazana Building, Hyderabad
May 21 – Thursday
Tourism influencers and YouTubers interaction sessions
District-level tourism promotion activities by District Collectors and Tourism Officers
May 22 – Friday
Swachhata drives at tourist destinations
May 23 – Saturday
Release of Tourism Brand Kit by District Collectors
Cleanliness drives at heritage monuments including Paigah Tombs
HERITAGE
May 18 – Monday
Free entry to State museums
International Museum Day celebrations at State Museum, Hyderabad
May 19 – Tuesday
Release of brochures for site museums
Awareness campaign on archaeology and conservation certification courses
May 20 – Wednesday
Registration of volunteers for local tourist guide training
Heritage monument cleanliness drives including vegetation clearance at Gunfoundry, Hyderabad
May 21 – Thursday
Release of brochures for site museums
May 22 – Friday
Cleanliness drives at heritage sites in Panagal, Karimnagar and Warangal
May 23 – Saturday
Release of brochure for Centenary Heritage Museum
Cleanliness drive at Centenary Heritage Museum, Hyderabad
NITHM
May 18 – Monday
Career guidance workshop focusing on tourism and hospitality sector
May 19 – Tuesday
Faculty development programme on technological enhancement
May 21 – Thursday
Skill development initiative and preparation of training calendar for Telangana departments
May 22 – Friday
Career guidance workshop on tourism and hospitality sector
May 23 – Saturday
Tourism Conclave 2026 on “Destination Telangana: Strategies for the Next Frontier of Tourism”
Venue: Hyderabad
LANGUAGE & CULTURE
May 18 – Monday
Programmes for amateur artists featuring traditional folk and filmy folk dances
Venue: Ravindra Bharati, Hyderabad
Time: 6.30 p.m. to 8 p.m.
Similar cultural activities to be conducted at district level
May 19 – Tuesday
Perini, Kuchipudi, Bharatanatyam and Kathak dance performances
Venue: Ravindra Bharati, Hyderabad
Time: 6 p.m. to 8 p.m.
May 20 – Wednesday
Traditional folk songs, filmy folk songs and Hindustani & Carnatic classical music performances
Venue: Ravindra Bharati, Hyderabad
Time: 6 p.m. to 8 p.m.
May 21 – Thursday
Kavi Sammelanam and literary programmes including “Kathaka and Navalekhakula Srujanaanubhavam”
Venue: Ravindra Bharati, Hyderabad
Time: 6 p.m. to 8 p.m.
May 22 – Friday
Padya Natakalu, mythological dramas and musical theatre performances
Venue: Ravindra Bharati, Hyderabad
Time: 6 p.m. to 8 p.m.
May 23 – Saturday
Flute, tabla, dappu and keyboard performances
Venue: Ravindra Bharati, Hyderabad
Time: 6 p.m. to 8 p.m.