బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి సతీసమేతంగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు…
  • శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

అత్యంత మహిమాన్వితమైన, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో లోకకల్యాణం కోసం ఈ దివ్య కళ్యాణం నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భంగా అమ్మవారిని ఒక్కటే ప్రార్థిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు పాడి పంటలు పండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలి. ప్రకృతి వైపరీత్యాల గురించి ఆందోళనలు ఉన్న ఈ సమయంలో, గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొని తన భక్తులను కాపాడిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ బోనాలంటే ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక ఆధ్యాత్మిక వైభవం.

ఈ మహోత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పరస్పర సహకారంతో భక్తిశ్రద్ధలతో వేడుకలను జరుపుకోవడం మన తెలంగాణ గొప్పతనం. ప్రభుత్వం తరఫున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయినప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అక్కడక్కడా స్వల్ప అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో భక్తులు సహనంతో సహకరించి అమ్మవారిని దర్శించుకొని, తమ కోరికలను తీర్చుకోవాలని కోరుతున్నాం. బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించింది. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. బోనాల సందర్భంగా 3 వేలకు పైగా దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది అంజి దేవాలయాల్లో మంచి వర్షాలు పడాలని పూజలు చేయాలి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, లోకకల్యాణం చేకూరాలని ఈ పవిత్ర సందర్భంగా మనసారా ప్రార్థిస్తున్నాం.