- నాణ్యమైన చేపల ఆహారాన్ని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి
- మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను పరిశీలించి నిర్వహణ, పరిశుభ్రతపై అధికారులతో సమీక్ష
- క్యాంటీన్లో అందుబాటులో ఉన్న మెనూ, చేపల వంటకాల గురించి వివరాలు తెలుసుకున్న మంత్రి
- నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఆదేశం
- చేపలు అధిక ప్రోటీన్లు, పోషకాలు కలిగిన ఆహారమని, ప్రజలు చేపల వినియోగాన్ని పెంచుకోవాలని సూచన
- ఫిష్ క్యాంటీన్ సేవలను మరింత మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం
- క్యాంటీన్‌ను ఆధునిక సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆదేశం
హైదరాబాద్ : రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి మత్స్యశాఖ డైరెక్టర్ శ్రీమతి నిఖిల, అదనపు డైరెక్టర్ మురళీకృష్ణతో పాటు శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వినియోగదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్లో అందుబాటులో ఉన్న చేపల వంటకాలు, మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారమని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చేపల వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మరింత మంది ప్రజలకు ఫిష్ క్యాంటీన్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, క్యాంటీన్‌ను మరింత ఆధునికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. జారీ చేసినవారు: ప్రజాసంబంధాల అధికారి, రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజనసర్వీసులు & క్రీడల మంత్రిత్వ శాఖ.#7207541667.